గాంధీజీ చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరు అలవరచుకోవాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరు ఫిట్‌గా ఉంటే కరోనా దరి చేరదనే విషయం తేట తెల్లమైందన్నారు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని కడపలో జిల్లా అధికారులు, క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ మైదానం నుంచి జేఎంజే కళాశాల వరకు 2కే రన్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, క్రీడల అధికారి రామచంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. 2 కే రన్ ఉద్దేశాన్ని జాయింట్ కలెక్టర్ మీడియాకు వివరించారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని అందరూ ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు, యువత 2 కే రన్ లో పాల్గొన్నారు.
గాంధీ జయంతి పురస్కరించుకుని 2కే రన్ - gandhi jayanthi 2020
మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని కడప జిల్లాలో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ మైదానం నుంచి జేఎంజే కళాశాల వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, క్రీడల అధికారి రామచంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
గాంధీజీ చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరు అలవరచుకోవాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరు ఫిట్‌గా ఉంటే కరోనా దరి చేరదనే విషయం తేట తెల్లమైందన్నారు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని కడపలో జిల్లా అధికారులు, క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ మైదానం నుంచి జేఎంజే కళాశాల వరకు 2కే రన్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, క్రీడల అధికారి రామచంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. 2 కే రన్ ఉద్దేశాన్ని జాయింట్ కలెక్టర్ మీడియాకు వివరించారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని అందరూ ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు, యువత 2 కే రన్ లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
గాంధీజీ ఆశయాలు సీఎం జగన్‌తోనే సాధ్యం: సజ్జల