VIVEKA MURDER CASE: మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. రెండు నెలల తర్వాత సీబీఐ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నించారు. పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ సోదరుడే కిరణ్ కుమార్ యాదవ్.
గతంలో సునీల్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, తల్లిదండ్రులను కూడా సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. ప్రస్తుతం సునీల్ యాదవ్ కడప జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోఅతని సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ ను మరోసారి దాదాపు రెండు గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. న్యాయవాది సమక్షంలో కిరణ్ ను విచారించినట్లు సమాచారం. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై కిరణ్ కుమార్ యాదవ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: YS Viveka murder case: జైల్లో శివశంకర్రెడ్డిని కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు