YS Viveka Murder Case: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సునీల్, ఇతర నిందితులతో కలిసి వివేకాను హత్య చేశాడని సీబీఐ పేర్కొంది. హత్య రోజు రాత్రి సునీల్.. అవినాష్, భాస్కర్‌రెడ్డి ఇంటికెళ్లినట్లు తెలిపింది. అవినాష్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరం ఉందని.. ఎంపీ టికెట్ షర్మిల లేదా విజయమ్మ లేదా తనకివ్వాలని వివేకా కోరుకున్నారని తెలిపింది. వివేకా రాజకీయాలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని.. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని సీబీఐ వెల్లడించింది. ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారని.. అవినాష్‌రెడ్డి 90002 66234కు ఫోన్ చేసి కాసేపు మాట్లాడారని తెలిపింది.
వివేకా గుండెపోటుతో చనిపోయారని సీఐకి సమాచారం ఇచ్చారని పేర్కొంది. హత్యను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాలని ప్రయత్నించినట్లు తెలుస్తోందని తెలిపింది. కుట్రలో భాగంగానే గుండెపోటు, విరేచనాల కథ అల్లినట్లు కనిపిస్తోంది సీబీఐ పిటిషన్లో వెల్లడించింది. నిందితులు వివేకా హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని.. వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టినట్లు సీబీఐ పిటిషన్లో పేర్కొంది.
వివేక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కడప ఎంపీకి అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. జనవరి 28న తొలిసారిగా సీబీఐ ఎదుట హజరైన అవినాష్‌రెడ్డిని ..అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి.. తనను మరోసారి పిలిచే అవకాశం ఉందని వెల్లడించారు. విచారణ సమయంలో కడప ఎంపీ కాల్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు.. తాజాగా రెండోసారి మరిన్ని విషయాల పైన విచారించే అవకాశం ఉంది.
అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా వివేక హత్య జరిగిన రోజు తాడేపల్లి కార్యాలయంలో పనిచేసే నవీన్, అదేవిధంగా సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి మొబైల్స్ కు ఫోన్ చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని.. వైఎస్ భాస్కర్‌రెడ్డి 23వ తేదీ విచారణకు రావాలని నోటీసులు పంపారు. అయితే వేరే కారణాల వల్ల తాను విచారణకు రాలేనని భాస్కర్‌రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారమిచ్చారు. భాస్కర్‌రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
ఇవీ చదవండి: