వివేకా(viveka) హత్య కేసులో సీబీఐ(cbi) విచారణ కొనసాగుతోంది. అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్(computer operator)గా పని చేసే ఇదయ్ తుల్లాను అధికారులు ప్రశ్నించారు. దస్తగిరిని రెండో రోజు విచారణ చేస్తున్నారు. నిన్న ఏడు గంటల పాటు అతడిని ప్రశ్నించారు. ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని సూచించడంతో ఉదయం 10 గంటలకు దస్తగిరి అధికారుల ఎదుట హాజరయ్యారు.
గతంలో దాదాపు నెల రోజుల పాటు దిల్లీ తీసుకెళ్లి ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం లేకపోయినా వారికి వచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి విచారణ చేస్తున్నారని కారు డ్రైవర్ దస్తగిరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన రోజు బెడ్ రూమ్లో.. బాత్ రూమ్ లో రక్తం మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని మొదటగా ఫోటోలు తీసింది.. ఇదయ్ తుల్లా అనే అనుమానంతో సీబీఐ అధికారులు అతని వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
Anandayya Medicine: ఆనందయ్య 'కె' మందు పంపిణీని అడ్డుకోవద్దు: హైకోర్టు