కడప రిమ్స్‌లో నిన్న మూడు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కరోనా లేదని ధ్రువీకరించినందున వారు వెళ్లిపోయారు. మరో మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వారిద్దరూ ఇటీవల గల్ఫ్ నుంచి కడపకు వచ్చారు. కొద్ది రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధ పడుతుంటే అనుమానంతో రిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లేదని వైద్యులు నిర్ధారించారు. ఓ మహిళ ఇటీవల మక్కా యాత్ర ముగించుకుని కడపకు చేరుకుంది. గత కొద్ది రోజుల నుంచి విపరీతమైన దగ్గుతో బాధపడుతుంటే ఆమె బంధువులు రిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఆమెను కరోనా వార్డ్‌లో పెట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: సినిమా థియేటర్లు మూసివేత... పాఠశాలలకు సెలవులు