కడప జిల్లా రాజంపేటలో ఈనెల 26 నుంచి జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల అనంతరం నిర్వాహకులు బుధవారం రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ మేయర్ సురేష్‌బాబు ఈ క్యాంప్ ఫైర్‌ను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ క్యాంప్ ఫైర్‌లో నృత్యాలు చేశారు. 'ఈటీవీ' ఢీ జోడి నృత్య కళాకారులు రాజు, అక్సాఖాన్ ఆ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజంపేట పట్టణవాసులు పెద్ద సంఖ్యలో క్యాంప్ ఫైర్‌లో పాల్గొన్నారు.
ఆటల్లో జోరు.. క్యాంప్ ఫైర్‌లో హుషారు - రాజంపేటలో జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు
ఉదయమంతా ఉత్కంఠ పోటీలతో సందడిగా ఉన్న రాజంపేట క్రీడాప్రాంగణం... సాయంత్రానికి మరింత సందడిగా మారింది. క్యాంప్ ఫైర్‌లో క్రీడాకారులు నృత్యాలతో అలరించారు. క్రీడాకారులకు 'ఈటీవీ' ఢీ జోడి నృత్యకారులు తోడవ్వటంతో... సందడి తారాస్థాయికి చేరింది.
కడప జిల్లా రాజంపేటలో ఈనెల 26 నుంచి జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల అనంతరం నిర్వాహకులు బుధవారం రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ మేయర్ సురేష్‌బాబు ఈ క్యాంప్ ఫైర్‌ను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ క్యాంప్ ఫైర్‌లో నృత్యాలు చేశారు. 'ఈటీవీ' ఢీ జోడి నృత్య కళాకారులు రాజు, అక్సాఖాన్ ఆ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజంపేట పట్టణవాసులు పెద్ద సంఖ్యలో క్యాంప్ ఫైర్‌లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి : అఖిలపక్ష భేటీలో వైకాపా ఎంపీలు ఏం మాట్లాడారంటే..!