కడప జిల్లా గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయానికి 2లక్షల 10 వేల రూపాయల విలువ చేసే ఒంటె రథమును వేంపల్లె మండలం కుప్పాలపల్లి గ్రామ వాస్తవ్యులు బహుకరణ చేశారు. కుప్పాలపల్లికి చెందిన బంకా సోమేశ్వర రెడ్డి ఆయన ధర్మపత్ని లక్ష్మీ.. గ్రామోత్సవం కోసం తయారు చేయించిన రథాన్ని మంగళవారం ఆలయానికి అప్పగించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఆలయ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి సమక్షంలో రథాన్ని బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఆర్ఎల్వీ ప్రసాద్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: