కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగను ముస్లింలందరూ ఇళ్లలోనే జరుపుకోవాలని కడప డీఎస్పీ నారాయణస్వామి సూచించారు. కడప జిల్లా రైల్వేకోడూరులో మండలస్థాయి అధికారులతో, ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. ప్రార్థనలు చేసుకునేందుకు మసీదులకు ఎవరూ వెళ్లవద్దని కోరారు. కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి ఇళ్లనుంచి బయటకు వచ్చినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పంటను తీసుకెళ్లేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. వారిని ఎక్కడా తిరగనివ్వవద్దని అధికారులను ఆదేశించారు. నిత్యావసరాల కోసం ఇళ్ల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు ధరించేలా చూడాలన్నారు. చిన్న చిన్న కారణాలతో రోడ్లమీదకు రావొద్దని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. కేసులు పెరగటానికి కారకులెవరు?: అఖిలప్రియ