కడపలోని నాగరాజుపేటలో మూడు అంతస్తుల భవనం తెల్లవారుజామున కుప్పకూలింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ద్విచక్ర వాహనాలతో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసమైంది.
బాధితుల వివరాల ప్రకారం.. కూలిన భవనంలో యజమానితో పాటు వెంకటేశ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. తెల్లవారుజామున ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో వెంకటేశ్, అతని భార్య, నలుగురు పిల్లలతో పాటు బయటకు వచ్చేశాడు. వారు వచ్చిన కొద్ది క్షణాల్లోనే బిల్డింగ్ కూలిపోయింది. కాస్త ఆలస్యమైన తమకు ప్రాణహాని ఉండేదన్నారు.
భవనం మరమ్మత్తుల కోసం యజమానురాలు... నిన్న ఇంటి కింద గుంత తవ్వించారని వెంకటేశ్ దంపతులు చెప్పారు. ఈ ఘటనకు అదే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో బయటకు వచ్చామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
Viveka murder case: వివేకా డ్రైవర్ని 7 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు