బొమ్మల కొలువు... కొత్త తరానికి మేలుకొలుపు - బొమ్మల కొలువు... కొత్త తరానికి మేలుకొలుపు
భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాల మేళవింపే మన పండుగలు. కాలం మారుతున్న కొద్దీ ఆలోచనల్లో, ఆచారవ్యవహారాల్లో మార్పులు వస్తుంటాయి. కొన్ని తరాల తర్వాత కొన్ని సంప్రదాయాలు మరుగున పడే అవకాశం ఉంది. అందుకే విలువలతోపాటు ఆచారాలు భవిష్యత్ తరాలకు అందించేలా బొమ్మల కొలువు అనే ప్రక్రియ చేపట్టారు మన పూర్వీకులు. దసరా లాంటి ప్రధాన పండుగల సమయంలో ఈ బొమ్మల కొలువు చిన్నాపెద్దా అందర్నీ ఆకర్షిస్తోందీ.
శ్రీనివాస కల్యాణం, శ్రీకృష్ణ జన్మవృత్తాంతం, శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం...ఇలా ఎన్నో పురాణ, ఇతిహాస ఘట్టాలు బొమ్మలు కొలువులో ప్రతిబింబిస్తాయి. పురాణగాథలు చదివే అలవాటు లేని వారికి ఈ బొమ్మల ద్వారా ఎన్నో నీతి కథలు చెబుతారిక్కడ. సాధించాల్సిన విజయాల వైపు సాగేలా స్ఫూర్తి రగిల్చే జీవిత గాథలను అందిస్తుందీ బొమ్మల కొలువు .
ఇలాంటి ఎన్నో పురాణగాథలను తెలియజేస్తోంది... తిరుపతికి చెందిన రేవతి కేశవన్ కుటుంబం ఏర్పాటు చేసిన నవరాత్రి బొమ్మల కొలువు. కన్నయ్య అల్లరి తెలియాలన్నా...కలియుగ వైకుంఠ నాథుడి బ్రహ్మోత్సవాల విశేషాలు తెలుసుకోవాలన్నా ఆ ఇంటికి వెళ్లాల్సిందే. దాదాపు పదేళ్ల నుంచి ఏడాదికి ఓ కథాంశంతో బొమ్మల కొలువు తీర్చిదిద్దుతున్నారీ రేవతి కేశవన్ కుటుంబం. పరమానందయ్య శిష్యుల కథ, శ్రీనివాసుని కల్యాణం, శ్రీ మహావిష్ణువు దశావతరాలు, దుర్గా నవరాత్రుల ప్రత్యేకంగా నవశక్తి రూపాలు, కుంభకర్ణుడి నిద్ర ఇలా ఒకటా రెండా పదుల సంఖ్యలో పురాణ ఇతిహాస ఘట్టాలు ఇక్కడ దర్శనమిస్తాయి. .శ్రీరంగం, కడలూరు, కాంచీపురం, మధురై, చెన్నై, తిరుపతి నుంచి 5 వందల బొమ్మలు సేకరించి ఇక్కడ ఉంచారు.
కడపలోనూ విజయలక్ష్మీ అనే మహిళ 11ఏళ్ల నుంచి బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తున్నారు. వందల సంఖ్యలో దేవుళ్ళు ప్రతిమలు, కుల వృత్తుల ప్రతిమలు ఇక ప్రతిష్ఠించారు. దసరా పండుగ అంటే ఏమిటి? విశిష్టత ఏంటి? ప్రయోజనాలేంటి? ఇలా అన్ని వివరాలు బొమ్మల రూపంలో తెలియజేస్తున్నారిక్కడ. చుట్టుపక్కల జనం వచ్చి బొమ్మలు తిలకిస్తారు. పండుగల వెనుక ఉన్న ఆంతర్యం తెలియజేస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలు బొమ్మల ద్వారా కాపాడుకోవచ్చని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.
AP_CDP_36_07_PENNA_LO_GALLANTHU_AV_AP10039
Contributor: arif, jmd
( ) యాంకర్ వాయిస్ : కడప జిల్లా జమ్మలమడుగు మండలం లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా కుటుంబంతో కలిసి వెళ్లిన దంపతులకు గుండెకోత మిగిలింది. వివరాలోకి వెళ్తే ముద్దనూరు మండల కేంద్రానికి చెందిన బోడి భాస్కర్(29) కుటుబంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసుకొని సాయంత్రం సరదాగా పెన్నానదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామ సమీపంలో పెన్నానదిలో చోటు చేసుకుంది.యువకుని ఆచూకి కోసం పెన్నానదిలో అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ముమ్మరం గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకి లబించలేదు.ఎట్టకేలకు ఈరోజు సాయత్రం మృతదేహం నీటిలో తెలాడుతూ కానిపించింది. మృతదేహాని పోస్ట్మార్టం నిమితం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతునికి భార్య ఇద్దరు కుమారులు కలరు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజులుగా పెన్నానదిలో ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తోంది. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు. ఇప్పటికీ పెన్నానదిలో ముగ్గురు మృతి చెంది ఉన్నారు. ఒకరు యువకుడు కాగా ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం విశేషం. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా రెవెన్యూ ,నీటిపారుదల, పోలీసు అధికారులు పెన్నానదిలో ప్రవాహం ఎక్కువ ప్రవహిస్తున్నప్పుడు సంబంధిత సిబ్బందిని నియమించి ఎటువంటి ప్రాణహాని జరక్కుండా చర్యలు తీసుకోవాలి.Body:AP_CDP_36_07_PENNA_LO_GALLANTHU_AV_AP10039Conclusion:AP_CDP_36_07_PENNA_LO_GALLANTHU_AV_AP10039