BJP State President Purandeshwari Tour on YSR District: రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వ సాకారంతోనే జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె.. వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో డిక్సన్ కంపెనీని పురందేశ్వరి పరిశీలించారు. దిక్సన్ కంపెనీలో ఎన్ని యూనిట్లు నడుస్తున్నాయి ఎంతమంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు వారి పనీ వేళలు నాణ్యత అన్నిటి పైన సంబంధిత యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల పని వేళలను సరిగా పాటించడం లేదని ఫిర్యాదుల మేరకు యాజమాన్యాన్ని పురందేశ్వరి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి: పురందేశ్వరి
వల్లూరు మండలంలో వర్షాభావం తో దెబ్బతిన్న పంటలను పార్టీ నేతలతో కలిసి పురందేశ్వరి పరిశీలించారు. నీళ్లు లేక ఎండిపోయిన మినుము పంటను పురందేశ్వరి తో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎంపీ సీఎం రమేష్ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పసల బీమా పథకం సక్రమంగా అందుతుందా లేదా అని రైతులను పురందేశ్వరి అడిగి తెలుసుకున్నారు. వర్షం లేక నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కడపలో పార్టీ నాయకులు కార్యకర్తలతో పురందేశ్వరి సమావేశం నిర్వహించారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు - పురందేశ్వరి
ఏదైతే కెంద్ర ప్రభుత్వం వాగ్ధానం చేసిందో వాటన్నింటినీ కూడా నెరవేర్చడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో కేంద్రం కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది.. కాని ఇప్పుడు ఇక్కడ ఈ ట్రిపుల్ఐటీ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా అవసరం ఉందని అన్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదు.. అలానే అనంతపురంలోని విశ్వవిద్యాయం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిచకపోవడం చాలా విచారకరం అని అన్నారు.
ట్రిపుల్‌ఐటీలో జరుగుతున్న రీసెర్చ్‌లు సాధారణంగా ఐఐటీలలో కూడా జరగవు.. అలాంటి గొప్ప ట్రిపుల్ఐటీకి పూర్తి సహకారం అందించాల్సి ఉందని తెలిపారు. 150 ఎకరాలు ఇప్పుడు దీనికోసం కేటాయంచడం జరిగింది.. దీనికి ప్రహారీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించవలసి ఉంది.. కాని ఇప్పటి వరకు 15శాతం పనులు మాత్రమే జరిగింది మిగతా పనులు మిగిలిపోయి ఉన్నవి. మిగిలిన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఈ ట్రిపుల్ఐటీకి మరిం సహకరించాలని పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నా రాష్టాన్ని అభివృద్ధి చేయడంలో వైసీపీ సర్కారు విఫలం - పురందేశ్వరి
ట్రిపుల్‌ఐటీలో జరుగుతున్న రీసెర్చ్‌లు సాధారణంగా ఐఐటీలలో కూడా జరగవు.. అలాంటి గొప్ప ట్రిపుల్ఐటీకి పూర్తి సహకారం అందించాల్సి ఉంది. 150 ఎకరాలు ఇప్పుడు దీనికోసం కేటాయంచడం జరిగింది.. దీనికి ప్రహారీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించవలసి ఉంది. కానీ, ఇప్పటి వరకు 15శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు మిగిలిపోయాయి. మిగిలిన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఈ ట్రిపుల్ఐటీకి మరింత సహకరించాలి - పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు