మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్లకు నిజమైన వారసుడు ప్రధాని నరేంద్రమోదీ అని... భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. కడపలో గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సత్యకుమార్ మాట్లాడారు. గాంధీపేరు అరువు తెచ్చుకొని గతంలో పాలించిన పాలకులు... దేశాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. మోదీ ప్రజలు మెచ్చిన నాయకుడనీ... ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదరాభిమానాలు చూరగొన్నారని కొనియాడారు.
ఇవీ చదవండి... భయపడొద్దు.. మేమున్నాం' చింతమనేనికి లోకేశ్ భరోసా