సీఎం జగన్ ఏడాది పాలనలో 69 సార్లు హైకోర్టు అక్షింతలు వేసినా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల విక్రయాలు, లీజు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కడపలో ఆయన ఉపవాస దీక్ష ప్రారంభించారు.
ప్లకార్డులతో నిరసన తెలిపారు. వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్తే.. ఏం జరుగుతుందో గతంలోని పాలకులందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అదే పని చేస్తున్నారని ఆగ్రహించారు. తక్షణం జీవోలను రద్దు చేసి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: