మాజీ మంత్రి వివేకా హత్య కేసు(ys viveka murder case)లో అనుమానితుడిగా ఉన్న భరత్ యాదవ్.. తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ బంధువే ఈ భరత్ యాదవ్. పులివెందులకు చెందిన ఇతన్ని.. సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. ఇటీవల దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా భరత్ యాదవ్(suspected bharat yadav) పేరు ప్రస్తావించారు.
అయితే.. వివేకాను హత్య చేయించింది ఎర్రగంగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. వివేకా హత్య గురించి తనకు సునీల్ యాదవ్.. అంతా చెప్పారని, సునీల్‌కు తాను రూ.16 లక్షలు కూడా ఇచ్చానని పేర్కొన్నారు. ఆస్తి, డబ్బు కోసమే ఈ హత్య జరిగిందని తెలిపారు. ఈ విషయాలన్నీ సీబీఐ అధికారులకు తెలిపానని కూడా భరత్ యాదవ్ చెప్పారు. వివేకా హత్యను ఎవరు చేశారన్నది ముందుగా సీబీఐకి సమాచారం ఇచ్చింది తానే అని చెప్పిన భరత్.. ప్రాణభయంతోనే ఇన్ని రోజులూ బయటికి చెప్పలేదన్నారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశానన్నారు.
ఇదీ చదవండి:
FLOOD RELIEF MEASURES: వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు.. ప్రభుత్వం నిర్ణయం