అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలానికి చెందిన తలారి సుదర్శన్ అనే యువకుడు పొలంలో పని చేసుకుంటున్న సమయంలో అతనిపై ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఇటీవల గ్రామ సమీపంలోని కొండలోకి వేరే ప్రాంతంలో దొరికిన ఎలుగుబంట్లను అటవీశాఖ అధికారులు వదిలి పెడుతున్నారని... అందుకే అవి తమపై దాడి చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని అటవీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం సుదర్శన్‌ను స్థానిక రైతులు, కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ప్రతి రాత్రి వారి నిద్ర శ్మశానంలోనే.. ఎందుకంటే..?