గంగమ్మ దేవత తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరు మండలం శివపురం దళితవాడ వద్ద బండలాగుడు పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 15 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. ఎడ్లు బండి లాగుతుంటే రైతులు కేరింతలు కొడుతూ ఆనందించారు. తిరునాళ్ల మహోత్సవానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోటీలను ఆసక్తితో తిలకించారు.
ఇవీ చదవండి..