ETV Bharat / state

కడప జిల్లా వ్యాప్తంగా సాగిన సార్వత్రిక సమ్మె - కడపలో భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు బంద్​కు ​ పిలుపునిచ్చాయి.కడప జిల్లా మొత్తంగా బంద్ జరిగింది... ర్యాలీలు సాగాయి. సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారు.

bahrath bundh news  at  kadapa  district
కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె
author img

By

Published : Jan 8, 2020, 8:28 PM IST

మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. కడప జిల్లా వ్యాప్తంగా సమ్మె జరిగింది. రాజంపేటలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రొద్దూటూరులో జరిగిన సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు కార్మిక సంఘాలు, సీపీఐ కార్యదర్శి విద్యార్థులు ర్యాలీ చేశారు. బద్వేల్ పట్టణంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు కడపలో ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో కోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. కడపలో ర్యాలీ చేస్తున్న ఆందోళనాకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. వైకాపా తెదేపా వామపక్షాలు, ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్​ఆర్​సీకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు. మైదుకూరు పట్టణంలో వామపక్షాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. రాయచోటిలోనూ బంద్ నిర్వహించారు.

కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె

ఇదీ చూడండి
ఆ కుటుంబాలకు సంక్రాంతి ముందే వచ్చింది...!

Intro:Ap_cdp_46_08_band_bhari ryali_Av_Ap10043
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కడప జిల్లా రాజంపేటలో వామపక్షాలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది భారీ పోలీసు బందోబస్తు మధ్య సిపిఐ, సిపిఎం, ఎన్జీవోస్, ఏఐటీయూసీ, విద్యార్థి సంఘాలు, అంగన్వాడి, ముస్లిం మైనారిటీ తదితర సంఘాలు పెద్ద ఎత్తున తరలి రాగా రాజంపేట ఎన్జీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా మార్కెట్, పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ సాగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజంపేట జేఏసీ తాలూకా చైర్మన్ ఎస్ వి రమణ, వామపక్ష నాయకులు మహేష్, రవికుమార్, ఎమ్మెస్ రాయుడు, శంకరమ్మ, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Body:రాజంపేటలో వామపక్షాల బంద్ ప్రశాంతం

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.