కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానం ఉపఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ(Badvel by-election nominations start) బద్వేలు ఎమ్మార్వో కార్యాలయంలో మొదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్.. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆయన విడుదల చేశారు. నేటి నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చే రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు.. కొవిడ్ నిబంధనల తప్పకుండా పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కును ధరించాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కడప ఎన్నికల కంట్రోల్ రూమ్ కు చరవాణి ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. నామినేషన్ల ప్రకియ మొదలవటంతో బద్వేలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
తొలి నామినేషన్
బద్వేలు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సంబంధించి మొట్టమొదటిగా నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్‌కు అందజేశారు. ఓటర్లందరూ తనను గెలిపిస్తే బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని గోదా రమేష్ తెలిపారు. తాను గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం గార్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తినని తెలియజేశారు. బద్వేలు ఎస్సీ రిజర్వేషన్ కావడం వల్ల నామినేషన్ వేసినట్టు నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ వెల్లడించారు.
ఇదీ చదవండి