జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతంగా చేపట్టడంలో కడప జిల్లా బద్వేలు జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 6 వేల 9వందల పనులు చేపట్టి జియో ట్యాగింగ్ ద్వారా ఆ పనులకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేయడం జరిగింది. ఇందుకుగాను దిల్లీలో నేడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ చేతుల మీదుగా బద్వేలు ఎంపీడీవో రామకృష్ణయ్య, కన్సల్టెంట్ పర్యవేక్షకులు రామకృష్ణారెడ్డి అవార్డును అందుకున్నారు.
ఇవీ చదవండి