వైద్యులు లేకుండా నర్సులు మాత్రమే ప్రసవం చేశారని అందువల్లే తమ బిడ్డ చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్లిన ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామానికి చెందిన అనితకు.. ఈ విషాదం మిగిలింది.
ఈ నెల 11న ప్రసవం కోసం వెళ్లిన అనితకు.. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. అయితే.. ప్రసవం అయ్యాక చనిపోయిన మగశిశువు పుట్టినట్టు చెప్పారు. ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆందోళన చేశారు.
ఇదీ చదవండి: