కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలంలో బీటెక్ విద్యార్థి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివేక్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని లేఖలో తెలిపాడు. నా తల్లిదండ్రులు నాకు అన్ని ఇచ్చారని... వారికి నేనేం చేయలేకపోతున్నానని మనస్థాపానికి గురైయ్యాడు. అన్న సాయికి... అమ్మనాన్నను జాగ్రత్తగా చూసుకోమని, మరో జన్మంటూ ఉంటే మళ్ళీ పుడతా అంటూ కన్నీటి లేఖ రాశాడు. తన అవయవాలను ఇతరులకు దానం చేయాలని అందులో పేర్కొన్నాడు. చివరిగా.... అమ్మ ,నాన్న, అన్నయ్య, ఫ్రెండ్స్...ఐ మిస్ యు అని అక్షరాలతో లోకానికి సెలవులేఖ రాసి విగతజీవుడయ్యాడు.
ఇదీచూడండి.రాజుపాలెంలో తల్లికూతుళ్ల ఆత్మహత్యాయత్నం... కాపాడిన పోలీసులు