కడప జిల్లా ఎర్రగుంట్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంతరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కడప డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్, ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వర్, మునికుమార్ ఏటీఎం కేంద్రాల వద్ద అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. చదువురాని వారు, ముసలివాళ్లు ఏటీఎం కేంద్రాలకు వచ్చినప్పుడు వారికి నగదు విత్ డ్రా చేస్తామని చెప్పి..వారి ఏటీఎం కార్డులను తీసుకుని నకిలీ ఏటీఎం కార్డులను ఇచ్చేవారు.
అనంతరం వారి ఏటీఎం నుంచి నగదును ఈ ముగ్గురు దొంగలు విత్ డ్రా చేసుకునే వారని డీఎస్పీ వివరించారు. ఇవాళ ఉదయం ఈ ముగ్గురు ఎర్రగుంట్ల రోడ్డులోని వినాయక్ నగర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించారు. అటు వైపుగా వెళ్తున్న పోలీసులు వారిని చూసి వాహనాన్ని ఆపారు. వారిని చూసి ఈశ్వర్, మునికుమార్ పరారు కాగా వెంకటేశ్ పట్టుబడ్డాడు. అతని వద్ద పది రకాల ఏటీఎం కార్డులను పోలీసులు గుర్తించారు. ఇన్ని ఏటీఎం కార్డులు ఎక్కడివి అని ప్రశ్నించగా అతను సరైనా సమాధానం ఇవ్వలేదు. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఏటీఎం కేంద్రాల వద్ద అమాయక ప్రజలను మోసం చేసి డ్రా చేసేవారమని ఒప్పుకున్నారు. ఈ మేరకు వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: