ETV Bharat / state

విభేదాలు వద్దు.. అభివృద్ధి కోసం పని చేయండి: ఎమ్మెల్యే మేడా - mla

రాజంపేటలో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. వైద్యులు, ఆస్పత్రి కమిటీ ప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది.

సమావేశం
author img

By

Published : Aug 7, 2019, 10:20 AM IST

వ్యక్తిగత సమస్యలు పక్కనపెట్టి ఆసుపత్రి అభివృద్ధికి కృషిచేయండి: ఎమ్మెల్యే మేడా

కడప జిల్లా రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో.. గందరగోళం తలెత్తింది. వైద్యులు, ఆసుపత్రి కమిటీ ప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఒకరిద్దరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సమయపాలన పాటించడంలేదని అభివృద్ధి కమిటీ సభ్యులు ఖాజా మొహిద్దీన్, సుజాత, మధు ఆరోపించారు. దీనిపై వైద్యులు అనిల్, ధనశ్రీ స్పందించారు. ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు ఉండగా ముగ్గురు సెలవులపై ఉన్నారని.. వారు ఎప్పుడు వస్తారో తెలియదని చెప్పారు. తామిద్దరమే ఉదయం ఓపి, శవ పరీక్షలు, కాన్పులు చూసుకుంటున్నామని తెలిపారు. రాత్రి డ్యూటీలు చేస్తున్నా తమపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. లేనిపోని నిందలు వేసి అవమానపరిస్తే విధుల నుంచి తప్పుకొంటామని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్​ రెడ్డికి తెలియజేశారు. వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఇద్దరు వైద్యులను డిప్యూటేషన్ వేయాలని అక్కడే ఉన్న డీసీహెచ్ఎస్ పద్మజ కు సూచించారు. వైద్యులు సమన్వయంతో పనిచేయాలని రోగుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నారు.

ఇదీ చదవండి

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన

New Delhi, Aug 06 (ANI): Farooq Abdullah, president of the National Conference, has not been present in the house since Monday. Clarifying on this issue Union Home Minister Amit Shah said, "He is at home by his own will he is not willing to come then I cannot insist him. He has neither been detained nor under house arrested." However, Farooq Abdullah claimed that Home Ministry is lying in the Parliament.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.