ETV Bharat / state

నాన్నని చూడాలంటూ కోర్టుకు వచ్చిన చిన్నారి - న్యాయమూర్తి ఏం చేశారంటే! - DAUGHTER EMOTIONS TOWARDS FATHER

విడిపోవాలని న్యాయస్థానానికి వచ్చిన తల్లిదండ్రులు - ఆరేళ్ల చిన్నారి ఆవేదన

child_came_to_visakhapatnam_court_to_see_her_father
child_came_to_visakhapatnam_court_to_see_her_father (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Child Came to Visakhapatnam Court to See Her Father : ఇటీవల చిన్న చిన్న కారణాలకే విడిపోతామంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. ఇటువంటి ఘటన విశాఖలో జరిగింది.

ఆరేళ్ల చిన్నారి, చక్కగా తల్లిదండ్రులతో అల్లరి చేస్తూ, ఆటలాడుకుంటూ ఎదగాల్సిన వయసది. కానీ ఆ పాప జీవితం అలా లేదు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నా ఆ పాపకు సంతోషం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ పాప తండ్రి స్టీలుప్లాంటులో పనిచేస్తారు. తల్లి రైల్వేల్లో ఉద్యోగి. వారిద్దరు విభేదాలతో దూరంగా ఉంటున్నారు.

సహజంగానే ఆడపిల్లలకు తండ్రి అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. చిన్నప్పుడు ఆయన పక్కనుంటే ఆ ఆనందమే వేరు. ఆ చిన్నారికీ తండ్రితో ఆడుకోవాలని ఉంది. కానీ కలవలేకపోతుంది. దీనికి తోడు ఇటీవల తమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్​ డే సందర్భంగా తోటి స్నేహితుల తల్లిదండ్రులు ఆ కార్యక్రమానికి వచ్చారు. తాను మాత్రం తల్లితోనే ఉండాల్సి వచ్చింది. ఆ చిన్నారి హృదయం తండ్రి కోసం తల్లడిల్లింది. నాన్న కావాలంటూ తల్లి వద్ద రోజూ మారాం చేసింది.

ఏడడుగుల బంధంలో ఈ ఐదు తప్పనిసరి - మీలో ఈ లక్షణాలున్నాయా?

మంగళవారం కోర్టులో వాయిదాకు వచ్చినప్పుడు దూరంగా ఉన్న తన భర్తను ఆమె తన కుమార్తెకు చూపించింది ఆ తల్లి. తర్వాత తల్లితో సహా కుటుంబ న్యాయస్థానంలోకి వచ్చిన ఆ చిన్నారిని న్యాయమూర్తి కె.రాధారత్నం గమనించారు. పిల్లల్ని ఇలా తీసుకురాకూడదని, ఎందుకు తీసుకొచ్చారని తల్లిని ప్రశ్నించారు. దీంతో తల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.భాగ్యలక్ష్మి జరిగిన విషయాన్ని న్యాయమూర్తికి వివరించారు.

దీంతో న్యాయమూర్తి నేరుగా చిన్నారితో మాట్లాడారు. ఈ క్రమంలో ఇక్కడకు ఎందుకు వచ్చావని పాపను ప్రశ్నించగా ‘నాన్నను చూడడానికి’ అని బదులిచ్చింది. చిన్నారి ఆవేదనను గమనించిన న్యాయమూర్తి విచారణ కాసేపు నిలిపేశారు. తండ్రిని పిలిచి చిన్నారిని ఆడించి తీసుకురమ్మని ఆదేశించారు. దీంతో ఆ తండ్రీకుమార్తెలు రెండు గంటల పాటు న్యాయస్థానం ప్రాంగణంలోనే గడిపారు. ఆ తరువాత న్యాయమూర్తి చిన్నారి తల్లిదండ్రుల్ని పిలిచి కుటుంబ బాధ్యతలు వివరించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

73ఏళ్ల భార్య 69ఏళ్ల భర్త విడాకులు - రూ.3.7 కోట్లతో 43ఏళ్ల వివాహానికి కాస్ట్లీ ఎండ్​కార్డ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.