ETV Bharat / state

పల్నాడు డబుల్ మర్డర్ కేసు - 'సోదరులను చంపేసి ఆ డబ్బేదో మనమే తీసుకుందాం' - SISTER KILLED BROTHERS IN PALNADU

పల్నాడు జిల్లాలో సోదరులను చంపిన సోదరి - నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Palnadu Double Murder Case
Palnadu Double Murder Case (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2024, 12:21 PM IST

Palnadu Double Murder Case : పల్నాడు జిల్లా నకరికల్లులో డబ్బుకోసం తోబట్టువు, అన్నను, తమ్ముడిని హతమార్చిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు మంగళవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 'మా డబ్బు కోసం నువ్వు అడ్డొస్తున్నావు నిన్ను చంపాలని అన్న పథకం వేశాడు. నీ అడ్డు తొలగించుకుని చెరో రూ.35 లక్షలు పంచుకుంటాం’ అని సోదరితో తమ్ముడు మద్యం మత్తులో అన్న మాటలివి.

ఆ మాటలు విన్న నిందితురాలిలో అప్పటివరకూ లేని ఆలోచన పుట్టింది. వెంటనే ప్రియుడికి విషయం చెప్పి సోదరులను చంపేసి ఆ డబ్బేదో మనమే తీసుకుందామని తన మనసులో మాట చెప్పింది. హత్యలకు తాను దూరమని చెప్పాడు. కానీ అందుకు అవసరమైన సాయం చేస్తానని అతడు తెలిపాడు. ఈ క్రమంలో నిందితురాలు తన కాలనీలో జులాయిగా తిరిగే నలుగురు మైనర్లకు డబ్బు ఆశ చూపింది. వారి సహాయంతో గుట్టుగా అన్న, తమ్ముడిని వేర్వేరుగా హత మార్చింది. ఇదంతా పక్కా ప్లాన్​తో అమలు చేసింది.

పక్కా ప్రణాళికతో హత్యలు : నకరికల్లు యానాదులకాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తలపాల పోలరాజు అనారోగ్యంతో ఈ సంవత్సరం జనవరి 4న మరణించారు. ప్రభుత్వం నుంచి ఆయన కుటుంబానికి సుమారు రూ.70 లక్షల ఆర్థిక ప్రయోజనాలు రానున్నాయి. ప్రభుత్వం నుంచి అందే డబ్బు విషయంలో పోలరాజు కుమారులు గోపీకృష్ణ (పోలీసు కానిస్టేబుల్‌), దుర్గా రామకృష్ణ, కుమార్తె కృష్ణవేణి మధ్య వివాదాలు తలెత్తాయి. పెద్దలు పంచాయితీ చేసినా రాజీ కుదరలేదు.

ఈ నేపథ్యంలో ఓ రోజు తమ్ముడు దుర్గారామకృష్ణ కృష్ణవేణి ఇంటికి వచ్చాడు. ‘అన్న గోపీకృష్ణ నిన్ను చంపేసి, ఆస్తి మొత్తం పంచేసుకుందామని చెప్పాడని’ ఆమెతో అన్నాడు. దీంతో అప్రమత్తమైన ఆమె సోదరులిద్దరినీ చంపేందుకు ప్రణాళిక రచించింది. నకరికల్లుకు చెందిన తన ప్రియుడు మల్లాల దానయ్యకు ఈ విషయాన్ని చెప్పింది. అయితే నేరుగా తాను హత్యల్లో పాల్గొనని డబ్బుతోపాటు మృతదేహాలను తరలించేందుకు వాహనం సమకూరుస్తానని ప్రియుడు తెలియజేశాడు.

దీంతో నిందితురాలు నలుగురు మైనర్లను ఎంపిక చేసుకుంది. తాను చెప్పినట్లు చేస్తే శారీరక సుఖంతోపాటు డబ్బులు ఇస్తానని ఆశ చూపించింది. పథకం ప్రకారం గత నెల 26న తమ్ముడు దుర్గారామకృష్ణను ఇంటికి రమ్మని పిలిపించింది. అతనితో అతిగా మద్యం తాగించింది. ఈ క్రమంలో ఇద్దరు మైనర్లతో కలిసి అతడి గొంతు నులిమి చంపింది. అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి చల్లగుండ్ల వద్ద గోరంట్ల మేజర్‌లో పడేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది.

అనంతరం అన్న హత్యకు ప్లాన్ రూపొందించింది. మరో ఇద్దరు మైనర్లతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 10న గోపీకృష్ణ సోదరికి ఫోన్‌ చేసి, మద్యం తాగేందుకు రూ.500 నగదు అడిగాడు. ఇదే అదునుగా భావించి ఇంట్లోనే మద్యం బాటిల్ ఉందంటూ పిలిపించింది. మద్యంలో మత్తు మాత్రలు కలిపి, అన్నతో తాగించింది. మత్తులోకి జారుకున్న అతని మెడకి తాడు బిగించి హత్య చేసింది. అనంతరం మైనర్లతో కలిసి మృతదేహాన్ని మూటగట్టుకుని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి గుంటూరు బ్రాంచి కాలువలో పడేశారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. కాలువల్లో గాలించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీయించామని చెప్పారు. ప్రధాన నిందితురాలు కృష్ణవేణి, ఆమె ప్రియుడు దానయ్య, మరో నలుగురు మైనర్లను అరెస్టు చేశామని డీఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో సత్తెనపల్లి గ్రామీణ సీఐ సుబ్బారావు, నకరికల్లు ఎస్సై సురేష్‌ పాల్గొన్నారు.

ఆస్తి కోసం దారుణం - సోదరులను హతమార్చిన సోదరి!

వేట్లపాలెంలో దారుణం - కత్తులతో వెంబడించి ముగ్గురి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.