ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పది నెలలు గడిచినా ఉద్యోగుల్లో ఇంకా అభద్రతా భావం ఉందని ఏపీ ప్రజా రవాణా సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ అన్నారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నాన్ని ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తుచేశారు. కానీ జీతం మినహ ఇతర అలవెన్సులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని సౌకర్యాలు తమకూ కల్పించాలని కోరారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని పేర్కొన్నారు. అధికారుల తీరు అసంతృప్తిగా ఉందని, విలీనం కాకముందే బాగుండేదని కార్మికులు భావిస్తున్నట్లు వివరించారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: