కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపత్యం వివాదంపై రెండు కుటుంబాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. ఈయన బ్రహ్మంగారిమఠం వారసులకు చెందిన రెండు కుటుంబాలతో చర్చలు జరిపి... వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, మఠాధిపతుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.
ఆయన ఇచ్చే నివేదికను అనుసరించి ప్రభుత్వం ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో మఠాధిపతులతో కమిటీ వేసి పీఠాధిపతిని ప్రకటిస్తుంది. వివాదానికి కారకులైన రెండు కుటుంబాలతో చర్చించడానికి ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ ఈనెల 26న బ్రహ్మంగారి మఠానికి రానున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:
RRR letter: 'పట్టింపులకు పోకండి.. బోర్డు పరీక్షలు ఇప్పటికైనా రద్దు చేయండి'