ఏపీ ఎన్నార్టీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి జీవనోపాధి కోసం వెళ్లే ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్నార్టీ ఒక వరమని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ప్రాంతాల నుంచి వేలాది మంది పేదలు జీవనభృతి కోసం గల్ఫ్ వెళ్తున్నారని తెలిపారు. అక్కడ వారికి సరైన పనులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అలాంటి వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ఏపీ ఎన్నార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలోపేతం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ ఉన్నప్పటికీ సరైన సేవలందించలేదని విమర్శించారు.
ఇదీ చదవండి:
పెద్ద దర్గాలో చాదర్ సమర్పించిన ఉపముఖ్యమంత్రి