వందల కోట్ల రూపాయల మేర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్కో ఛైర్మన్ గుజ్జల శ్రీనివాస్ తీరుపై చేనేత సంఘాన నేతలు పోరుబాట పట్టారు. ఆయనపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బినామీ సొసైటీలను ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారని వారు ఆరోపించారు. సొసైటీల్లో 40 ఏళ్ల నుంచి తాము పని చేస్తున్నా.. ఇంతటి అవినీతి ఛైర్మన్ ను మాత్రం చూడలేదన్నారు. 2014కు ముందు సాదాసీదాగా ఉన్న ఛైర్మన్ ఇప్పుడు కోట్ల రూపాయలు అధిపతి అయ్యాడని ఆరోపించారు.
ఇవి చదవండి...అవినీతిపై పోరాడేందుకు లోక్పాల్ సూపర్ ఆఫర్