ETV Bharat / state

'ఆయన వైకుంఠం చూపిస్తే.. ఈయన కైలాసం చూపిస్తున్నారు'

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప పనులు జరగటం లేదంటూ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా నిర్మిస్తానంటూ మాజీ సీఎం వైకుంఠం చూపిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి కైలాసాన్ని చూపిస్తున్నారని విమర్శించారు.

author img

By

Published : Jan 18, 2020, 11:50 PM IST

ap State Vice President of the Congress Committee thulasi reddy press meet in kadapa
మీడియా సమావేశంలో సీఎం జగన్​పై మండిపడుతున్నకాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి
మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి మండిపడ్డారు. వారు రాష్ట్రానికి రాహువు, కేతువు లాంటివారని విమర్శించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా నిర్మిస్తాం అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు నిర్మిస్తామని అరచేతిలో కైలాసాన్ని చూపిస్తున్నారని విమర్శించారు. ఏడు నెలలుగా జగన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సాగు - తాగు నీటి ప్రాజెక్టుల్లో పురోగతి లేదన్నారు. అలాంటప్పుడు మూడు రాజధానులు ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

సాక్షి టెలిపోర్టు పునరుద్ధరణకు అనుమతి నిరాకరణ.. కేంద్రానికి కోర్టు నోటీసులు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.