ETV Bharat / state

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై భాగస్వాములకు ఆహ్వానం - ap government latest news

ap government
ap government
author img

By

Published : Nov 13, 2020, 4:51 PM IST

Updated : Nov 13, 2020, 7:04 PM IST

16:42 November 13

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న భాగస్వాములను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్​ఎఫ్​పీ నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారం ఈ మేరకు గ్లోబల్ నోటీసు ఇచ్చింది. జాయింట్ వెంచర్ ప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించినందున ఆసక్తి కలిగిన ప్రైవేటు భాగస్వాములు ప్రతిపాదనల్ని సమర్పించాలంటూ నోటీసులో ప్రభుత్వం పేర్కొంది. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్స్(ఆర్ఎఫ్​పీ)ను సమర్పించాల్సిందిగా స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఆసక్తి ఉన్న సంస్థలు ఆర్​ఎఫ్​పీ సమర్పించాలని సూచించింది.  

ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి వివాదాలు లేని 3500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ఈ గ్లోబల్ నోటీసులో స్పష్టం చేసింది.  ప్రతి ఏడాది 2 టీఎంసీల నీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, నాలుగు లైన్ల రహదారులు, రైలు కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నాయని  గ్లోబల్ నోటీసులో వెల్లడించింది. వీటితో పాటు ఎగుమతులు, దిగుమతుల కోసం కృష్ణపట్నం, రామాయపట్నం ఓడరేవులు స్టీల్ ప్లాంట్​కు  సమీపంలో ఉన్నాయని వివరించింది. ముడి ఇనుము నిల్వలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు కూడా ఈ యూనిట్​కు సమీపంలోనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్​లో పేర్కొంది.

ఇదీ చదవండి

సీఎం జగన్​ సీరియస్.. క్యాంపు కార్యాలయానికి విశాఖ నేతలు

Last Updated : Nov 13, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.