ETV Bharat / state

దిల్లీలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వైద్యులు మిస్సింగ్..! - తెలుగు డాక్టర్లు మిస్సింగ్

దిల్లీలో... ఏపీకి చెందిన ఇద్దరు వైద్యులు అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 25 నుంచి వీరిద్దరి జాడలేదు. ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్న వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారికేమైనా అపాయం జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

దిల్లీలో ఇద్దరు వైద్యులు మిస్సింగ్
దిల్లీలో ఇద్దరు వైద్యులు మిస్సింగ్
author img

By

Published : Dec 31, 2019, 1:16 PM IST

దిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం కలకలం రేపుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన దిలీప్‌ సత్య ఈ నెల 25 నుంచి కనిపించకుండా పోయారు. దిలీప్‌ సత్య ఛండీగఢ్‌లో పనిచేస్తుండగా... హిమబిందు దిల్లీలోనే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు.

హిమబిందు భర్తకు దిలీప్‌ సత్య మిత్రుడు. ఈనెల 25న వీరువురు చర్చికి వెళ్తున్నట్లు చెప్పారని... ఆ తర్వాత అదృశ్యమైనట్లు హిమబిందు భర్త తెలిపారు. ఐదురోజులుగా పోలీసులు వారి ఆచూకీ తెలుసుకోలేకపోయారని వివరించారు. వారికి ఏమైనా అపాయం జరిగి ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : ప్రకాశం జిల్లాలో దారుణం... పొలంలోకి నీళ్లొచ్చాయని హత్య!

File Name: AP_HYD_Del_20_30_Telugu_doctors_missing_avb_3181995 Slug: 3g_delhi_telugu_doctors_missing Reporter:విద్యా సాగర్ Cam: సుర్జీత్ ( ) దిల్లీ లో ఇద్దరు తెలుగు డాక్టర్లు అదృశ్యమయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురం కు చెందిన దిలీప్ సత్య ఈ నెల 25న అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు దిల్లీ లోని హజ్ ఖాస్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. కాగా హిమబిందు, దిలీప్, హిమబిందు భర్త శ్రీధర్ మెడికల్ కాలేజీలో మిత్రులు. తమ ప్రేమ వివాహాన్ని దిలీప్ దగ్గరుండి జరిపించాడని, హిమబిందుకు దిలీప్ సోదరుడి లాంటి వాడని అదృశ్యమైన హిమబిందు భర్త శ్రీధర్ తెలిపారు. అదృశ్యమైన ఇద్దరికి ఏదో అపాయం జరిగిందని, పోలీసులు ఐదు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఎలాంటి చిన్న ఆధారాలు కూడా లభించలేదని శ్రీధర్ చెప్పారు. ఈ నెల 25న ఇంటికి వస్తున్నట్లు దిలీప్ చెప్పారని... విధుల్లో భాగంగా ఏడున్నరకే ఎయిమ్స్ లో విధులకు వెళ్లగా.. ఇద్దరు చర్చి కి వెళుతున్నట్లు ఫోన్ చేసి చెప్పారని శ్రీధర్ అన్నారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి ఫోన్ లు స్విచ్ ఆఫ్ అయ్యయాని చెప్పుకొచ్చారు. అదృశ్యమైన హిమబిందు దిల్లీలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తుండగా.. దిలీప్ సత్య చండీగఢ్ లో వైద్యునిగా పని చేస్తున్నారు. Byte శ్రీధర్, అదృశ్యమైన హిమబిందు భర్త
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.