ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో దారుణం... పొలంలోకి నీళ్లొచ్చాయని హత్య! - latest murder in prakasham district

పొలంలోకి నీళ్లు వచ్చాయనే విషయంలో రెండు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న వివాదం హత్యకు దారితీసింది. ఈ దారుణం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం పొలాల్లో జరిగింది.

murder
ప్రకాశం జిల్లాలో దారుణం... పొలంలోకి నీళ్లొచ్చాయని హతమార్చారు
author img

By

Published : Dec 31, 2019, 10:58 AM IST

ప్రకాశం జిల్లాలో దారుణం... పొలంలోకి నీళ్లొచ్చాయని హతమార్చారు

ప్రకాశం జిల్లా రాజుపాలెంలో దారుణం జరిగింది. దుక్కిదున్నిన నీళ్లు.. పక్క పొలంలోకి వెళ్లినందుకు... ఇద్దరి రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ ఒకరి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏడుకొండలు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నుతున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వీరాంజనేయులు పొలంలోకి ఆ నీళ్లు వెళ్లాయి. వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి కుమారుడు చిరంజీవితో కలిసి రామాంజనేయులు... ఏడుకొండలు మీద కత్తి తో దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్రంగా గాయాలై...అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం తెలుకున్న యర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ స్థానిక ఎస్సై సీహెచ్‌ చంద్రావతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇవీ చూడండి:

మద్యం మత్తులో తల్లి, భార్యపై దాడి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.