ఈనాడు ఈటీవీ అవగాహనా సదస్సు గత ఎన్నికల్లో తక్కువగా పోలింగ్ నమోదైన కేంద్రాలను గుర్తించిన.. ఈనాడు - ఈటీవీ సంస్థలు.. కడప జిల్లా రాయచోటి లో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించాయి.పూలతోటపల్లి మహబూబ్గఢ్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో 41 శాతానికి మించి గతంలో ఓటింగ్ నమోదు కాలేదు.అప్పట్లోఅధికార యంత్రాంగం ముందస్తుగా అవగాహన కల్పించలేదు. ఈ పరిస్థితి మార్చేందుకు ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన శిబిరం నిర్వహించారు.విద్యార్థులు తల్లిదండ్రులకు ఓటు పట్ల అవగాహన కల్పించాలన్నారు.పోలింగ్ రోజు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేలా చైతన్యం తీసుకురావాలని కోరారు.
ఇవి చదవండి
ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: రమేశ్ కుమార్