కడప జిల్లా ఒంటిమిట్టలో నవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. ఉదయమే స్వామికి ప్రత్యేక పూజలు చేసిన పండితులు... వటపత్రసాయి రూపంలో అలకరించారు. అనంతరం ఆలయ మాఢవీధుల్లో స్వామిని ఊరేగించారు. ఈ సుందర దృశ్యం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.
కోదండరాముడు ఈ సాయంత్రం సింహవాహనంపై ఊరేగుతారు. ఈ నెల 18న స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 52 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ వేదిక సిద్ధం చేస్తున్నారు. కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు లక్షమంది భక్తులు వస్తారన్న అంచనతో సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఇవీ చూడండి......గోదాంలో అగ్రిప్రమాదం- కోట్ల పంట బుగ్గిపాలు....