దాతల సహకారంతో కడప జిల్లాలో మరో కొవిడ్ ట్రాన్సిట్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి తెలిపారు. నగరానికి చెందిన వీరభద్ర మినరల్స్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యం చేసిన కోటి రూపాయల ఆర్థిక సాయంతో.. రిమ్స్ సమీపంలోని అంబేడ్కర్ భవన్లో 200 పడకలతో ఆక్సిజన్ కొవిడ్ కేంద్రం ఏర్పాటు చేశారు. తన విజ్ఞప్తిని మన్నించిన వీరభద్ర మినరల్స్ యాజమాన్యం... 24 గంటల్లోనే కోటి రూపాయల ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించడం శుభ పరిణామమన్నారు. వారిచ్చిన ఆర్థిక భరోసాతో మూడు వారాల్లోనే యుద్ధ ప్రాతిపదికన కొవిడ్ ట్రాన్సిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కలెక్టర్ హరికిరణ్, వీరభద్ర మినరల్స్ యాజమాన్యం పాల్గొన్నారు.
ఇవీ చూడండి..