కడపలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న కడపలో ఇటీవల బీకేఎం వీధిలో ఒకే కుటుంబంలో నాలుగు పాజిటివ్ కేసులు రావటంతో... దాని ప్రభావం నగరంపై చూపింది. తాజాగా కడప రవీంద్రనగర్‌లో ఓ ఇంట్లో పాజిటివ్ కేసు నమోదవటంతో...పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.... బాధితుడిని కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ 108 వాహనంలో కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో మరి కొన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కడప నగరానికి మరింత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు రవీంద్ర నగర్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించారు.
ఇవీ చదవండి...కుప్పంలో మనిషి అవశేషాలు కలకలం