కరోనా కారణంగా ప్రధాన పండుగలన్నీ నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉగాది నుంచి మొదలుకొని వినాయక చవితి వరకు పండగలకు కళ తప్పింది. అయితే మొహర్రం పండుగ ముస్లింలదే అయినా... హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జరుపుకుంటారు. కరోనా నిబంధనలు ఉన్నందున జిల్లా పాలనాధికారి ఆదేశంతో... కడప జిల్లా ముద్దనూరు పట్టణం చావిడిలో పీర్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆగస్టు 28, 29, 30 తేదీల్లో కలెక్టర్ సూచన మేరకు, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పీర్ల ఊరేగింపు కార్యక్రమం జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: