కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో రాత్రి 9 గంటలు దాటిన మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి సమీపంలోనే ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో అమ్మాకాలు విచ్చలవిడిగా కొనసాగడం గమనార్హం. పట్టణంలో మొత్తం ఎనిమిది ప్రభుత్వ దుకాణాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆరున్నర గంటలకు అన్నీ దుకాణాలను మూసివేస్తామని ఎక్సైజ్ శాఖ సీఐ చెన్నారెడ్డి తెలిపారు. కానీ ముదునూరు రోడ్డులోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత కూడా విక్రయాలు కొనసాగాయి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్మాకాలు జరగటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెడ్‌జోన్ ప్రొద్దుటూరు నుంచి కొంతమంది మద్యం కోసం జమ్మలమడుగు పట్టణం రావటంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.