కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేట ఏఐటీయూసీ కార్యాలయంలో నిరసన చేపట్టారు. విద్యారంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన సంస్కరణలు తీసుకురావడం దారుణమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ తెలిపారు.
దిల్లీ విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలని భావించడం వల్ల అక్కడి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, గ్రామీణ విద్యార్థులకు అంతర్జాల సమస్య తీవ్రంగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ తరగతులను నిర్వహించాలనుకోవటం కూడా సరైన పద్ధతి కాదన్నారు. రీసెర్చ్ స్కాలర్ గా ఉంటున్న పీహెచ్డీ విద్యార్థులకు ఫెలోషిప్ ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమని చెప్పారు.
ఇదీ చదవండి: