విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దంటూ కడప కలెక్టరేట్ ఎదుట ఏఐసీటియూ, సీఐటియూ ఆధ్వర్యంలో అనేక ట్రేడ్ యూనియన్ సంఘాలు ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చాపకింద నీరులా ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పెద్ద కర్మాగారం ఉందంటే.. అది ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారమేనని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 70 వేల నుంచి లక్ష మంది ఉపాధి పొందుతోందని అన్నారు. అలాంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం అనటం.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం సరైంది కాదని తెలిపారు. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ.. 'విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా దారుణం'