ETV Bharat / state

ఈటీవీ, ఈటీవీ భారత్ కథనానికి స్పందన... పొలాలను పరిశీలించిన అధికారులు

కడప జిల్లా మైదుకూరు మండలం ఎల్లంపల్లె గ్రామంలోని మిడతల దండు సమస్యపై.. ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలకు అధికారులు స్పందించారు. వ్యవసాయాధికారులు గ్రామంలోని పొలాలను సందర్శించారు. ఈ మిడతలతో ప్రమాదమేమీ లేదని తెలిపారు.

Agricultural officers inspect to crops in ellampalle kadapa district
కడప జిల్లాలో పంటపొలాలపై మిడతల దాడి
author img

By

Published : Aug 12, 2020, 5:25 PM IST

'కడప జిల్లాలో మిడతల దండు..ఆందోళనలో రైతన్నలు' అనే శీర్షికతో ఈటీవీ, ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు కృష్ణమూర్తి, వ్యవసాయాధికారి లక్ష్మీప్రసన్న మైదుకూరు మండలం ఎల్లంపల్లె గ్రామంలోని పంటపొలాలను పరిశీలించారు.

రైతుల నుంచి వివరాలను సేకరించారు. జిల్లాలో మిడతల ప్రభావం లేదని చెప్పారు. రైతులు అనవసరంగా ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కీటక నాశనులు వాడితే ఈ మిడతలను నివారించవచ్చని తెలిపారు. వీటితో పొలాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని రైతులకు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:

కడప జిల్లాలో మిడతల దండు..ఆందోళనలో రైతన్నలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.