గతేడాది కుందూ నది వరదల వల్ల నష్టపోయిన పంటలు, కోతకు గురైన పొలాలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. గుంటూరు కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు.. కడప జిల్లా పెద్దముడియం మండలంలో పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
కుందూ నది వరద కారణంగా.. గతేడాది వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పెద్ద మొత్తంలో భూమి కోతకు గురైంది. 375 హెక్టార్లలో కోటి 30 లక్షల నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ విషయంపై సమాచారం సేకరించడానికి గుంటూరు కమిషనరేట్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు భగవత్ స్వరూప్ మండలానికి విచ్చేశారు. పాలూరు, చిన్న ముడియంలలో రైతులతో మాట్లాడి.. వివరాలను తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: