కడప నగరంలోని మట్టి పెద్దపులి వీధిలో ఉన్న పెట్రోల్ బంక్లో.. కల్తీ పెట్రోల్ వస్తుండడాన్ని వాహనదారులు గమనించారు. సీసాలో పెట్రోల్ పోయించుకున్న ఓ వ్యక్తి.. 70 శాతం మేర నీటితో కల్తీ చేయడాన్ని గుర్తించాడు. స్థానికుల సాయంతో వెంటనే పెట్రోల్ బంకు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెట్రోల్ బంక్ పై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే బంకును సీజ్ చేయాలని కోరారు. ప్రజలు ఎంతో నమ్మకంగా పెట్రోల్ పోయించుకుంటుంటే.. ఇలా మోసం చేయడం దారుణమని వాహనదారులు ఖండించారు.
ఇదీ చదవండి: