కడప జిల్లా రైల్వే కోడూరులో.. ఎర్రగుంట్ల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కో-ఆర్డినేటర్ గా పనిచేస్తున్న దుద్యాల అనితా దీప్తి అనే ఉద్యోగిని(WOMEN EMPLOYEE RESIGNED TO JOB) తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో వైకాపా మంత్రులు(YSRCP MINISTERS COMMENT ON BHUVANESWARI).. తెదేపా అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
రైల్వేకోడూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తన నిర్ణయాన్ని వెల్లడించారు. వైకాపా ప్రభుత్వంలో తాను ఉద్యోగం చేయలేనని.. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో అనేక ఒత్తిళ్లకు గురయ్యానని వాపోయారు. అసెంబ్లీలో ఒక మహిళకు జరిగిన అవమానాన్ని భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆమెతోపాటు తెదేపా నాయకులు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేసి.. ముఖ్యమంత్రి, మంత్రులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:
వరదలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులు