కడప జిల్లా సిద్ధవటంలో దిగువపేటకు చెందిన వెంకటశివ తండ్రి చంద్రశేఖర్ వర్థంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన వెంకట శివ స్నేహితులు 10 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మొత్తం శివతో కలిపి 11 మంది పెన్నా నది దగ్గరకు వెళ్లారు. అందులో 8 మంది సరదాగా స్నానం చేసేందుకు నదిలో దిగారు. ఈ క్రమంలో వీరంతా ఒక్కసారిగా మునిగిపోయారు. అతికష్టం మీద వెంకట శివ నది నుంచి బయటపడగా.. మిగతా ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో సోమశేఖర్, యశ్వంత్, తరుణ్, జగదీశ్, రాజేశ్, సతీశ్, షన్ను ఉన్నారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరో ఐదుగురి కోసం పోలీసులు, గజఈతగాళ్లు గాలింపు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: వారం రోజుల్లో పెళ్లి... ఇంతలో హత్యాయత్నం!