కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ నెల 18న జరిగిన హత్య కేసులో నిదితులను పోలీసులు అరెస్టు(ACCUSED IN MURDER CASE ARRESTED BY POLICE) చేశారు. దొరసానిపల్లెకు చెందిన తిరుమలేశ్వరరెడ్డి కనిపించక పోవడంతో ఆయన తండ్రి సోమేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామీణ పీఎస్లో అదృశ్యం కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తుండగా కొత్త పేటలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఇంటి తలుపులు తెరిచి చూడగా ఓ గదిలో తిరుమలేశ్వరరెడ్డి మృతదేహం మూటలో కనిపించిందని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.
తిరుమలేశ్వరెడ్డి కొత్తపేటలోని సుంగల హస్సేన్ వలి అనే వ్యక్తికి డబ్బులు ఫైనాన్స్ ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి చెల్లించే విషయంలో హుస్సేన్ వలి అతని కుటుంబ సభ్యులు తిరుమలేశ్వరరెడ్డితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో హుస్సేన్ వలి అతని భార్య షమీమ్, మరో వ్యక్తి రాజుతో కలిసి తిరుమలేశ్వరరెడ్డిని చంపారని అతని తండ్రి సోమేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామీణ ఎస్సై శివశంకర్, సిబ్బందితో కలిసి ఆ ముగ్గురునీ అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తిరుమలేశ్వరరెడ్డిని హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తితో పాటు ఓ ద్విచక్రవాహనాన్ని పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: