కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ పశువైద్య కళాశాలలోని బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ నుంచి 24 మందికి విముక్తి లభించింది. రెండో విడత స్వాబ్ నమూనాల్లో నెగిటివ్ ఫలితాలు రావడం వల్ల 24 మందిని ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం మరో 68 మంది క్వారంటైన్లో ఉన్నారు. ఆ కళాశాలలోనే బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన మరో క్వారంటైన్లో 99 మంది ఉన్నారు. అందులో 16 మందికి రెండో విడత స్వాబ్ నమూనాలను కరోనా నిర్ధరణ పరీక్షలకు పంపారు. వారికి కూడా నెగిటివ్ వచ్చినందున... 16 మందిని ఇళ్లకు పంపించే యోచనలో వైద్యాధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి :