పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో యువకుడు గల్లంతయ్యాడు. మండల కేంద్ర కాళ్ల పంచాయతీ పరిధి పేదపేటకు చెందిన చిత్రి సునీల్(18) అయిదుగురు మిత్రులతో కలసి పేరు పాలెం బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా.. అలల ఉద్ధృతి ఎక్కువ కావడంతో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రియ కుమార్.. సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. సునీల్ తండ్రి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చచవండి: