పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన షాహిద్ అలీఖాన్(19) ఎన్ఐటీ ప్రాంగణంలో కూలీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అతని సోదరుడు సైఫ్ అలీ ఖాన్ వెతుకుతుండగా..ఎన్ఐటీ ప్రాంగణంలో షాహిద్ రక్తపు మడుగులో కనిపించాడు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. సైఫ్ అలీ ఖాన్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాడేపల్లిగూడెంలో యువకుడు అనుమానాస్పద మృతి
బతుకుదెరువు కోసం వచ్చిన ఓ బిహార్ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో జరిగింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.